బీటెక్ చదువు, లవర్‌తోనే పెళ్లి.. జైషా ఆస్తులు తెలిస్తే షాకే

TV9 Telugu

28 August 2024

అంతర్జాతీయ క్రికెట్ మండలి కొత్త ఛైర్మన్‌గా జైషాను మంగళవారం ప్రకటించారు. షా అక్టోబర్ 2019 నుంచి BCCI కార్యదర్శిగా, జనవరి 2021 నుంచి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పనిచేశారు. 

ప్రస్తుత చైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీకాలం డిసెంబర్‌లో ముగియడంతో షా ఆ పదవిని చేపట్టనున్నారు. 35 ఏళ్ల వయస్సులో, షా ICC చరిత్రలో అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా నిలిచాడు. 

జగ్‌మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ వంటి భారతీయుల తర్వాత ఈ పదవిని చేపట్టిన 5వ భారతీయుడు.

నివేదికల ప్రకారం, జైషా రూ. 124 కోట్ల రూపాయల మొత్తం ఆస్తులకు యజమాని. జై షా తన వ్యాపారం వల్లనే ఇంత డబ్బు సంపాదించాడు.

 జైషా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే, జైషా 22 సెప్టెంబర్ 1988న జన్మించాడు. షా గుజరాత్‌లో చదువుకున్నాడు. బీటెక్‌ చేశాడు. 

జై షా భార్య పేరు రిషితా పటేల్. ఇద్దరూ కాలేజీలో స్నేహితులు. షా 2015లో పెళ్లి చేసుకున్నారు. జై షాకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.

బీసీసీఐ 2019లో జై షాకు కార్యదర్శి పదవిని అప్పగించారు. జైషా టెంపుల్ ఎంటర్‌ప్రైజ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. అతనికి కుసుమ్ ఫిన్‌సర్వ్‌లో దాదాపు 60 శాతం వాటా ఉంది. 

2015లో ఫైనాన్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ కమిటీ సభ్యుడిగా జైషా బీసీసీఐలోకి ప్రవేశించారు. బీసీసీఐలో చేరిన వెంటనే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌లో తన పదవిని వదులుకున్నాడు. 

2019 సంవత్సరంలో జైషా BCCI కార్యదర్శి అయ్యాడు. అప్పటి నుంచి భారత క్రికెట్ పూర్తిగా మారిపోయింది. డిసెంబర్ 1 నుంచి ఐసీసీ బాస్‌గా పదవి చేపట్టునున్నాడు.