ప్రస్తుతం భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నడుస్తోంది. ఇప్పటికే భారత్ 3-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. చివరి మ్యాచ్ ధర్మశాలలో జరగనుంది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాను విడుదల చేసింది. ఇందులో విరాట్ కోహ్లీ కంటే జైషా ముందున్నాడు.
అంటే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కంటే బీసీసీఐ అధ్యక్షుడు జైషా శక్తివంతమైన భారతీయుడిగా మారాడు.
తాజాగా ప్రకటించిన ఈ జాబితాలో శక్తివంతమైన భారతీయుల జాబితాలో బీసీసీఐ అధ్యక్షుడు జైషా 35వ స్థానంలో ఉన్నాడు.
శక్తివంతమైన భారతీయుల జాబితాలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ర్యాంక్ 38వ స్థానంలో ఉంది.
ఇప్పుడు ప్రశ్న ఎంఎస్ ధోని నంబర్ ఏమిటి? అని తెలుసుకుకోవాలని ఉందా.. శక్తివంతమైన భారతీయుల జాబితాలో ధోనీ 58వ స్థానంలో ఉన్నాడు.
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శక్తివంతమైన భారతీయుల జాబితాలో 68వ స్థానంలో నిలిచాడు.
అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. హోంమంత్రి అమిత్ షా రెండో స్థానంలో ఉన్నారు.