TV9 Telugu

ఇషాన్ - శ్రేయాస్‌లకు బ్యాడ్ న్యూస్.. ఇకపై ఆ సౌకర్యాలు మిస్..

1st March 2024

ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ల బ్యాడ్ డేస్ మొదలయ్యాయి. బీసీసీఐ వీరిద్దరిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించి, భారీ షాక్ ఇచ్చింది.

శ్రేయాస్ అయ్యర్ ఏడాదికి 3 కోట్లు, ఇషాన్ కిషన్ కోటి రూపాయలు తీసుకునేవారు. ఇప్పుడు ఇద్దరికీ ఆ డబ్బు అందదు.

అయితే, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు బీసీసీఐ ఇవ్వని మరో మూడు కీలక సౌకర్యాలపైనా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్పుడు ఇషాన్-అయ్యర్‌లు మునుపటిలా ఎన్సీఏ సౌకర్యాలు అందుకోలేరు. వారు ఇప్పుడు స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌పైనే ఆధారపడాల్సి ఉంటుంది.

అయ్యర్-ఇషాన్‌లకు బీసీసీఐ ఇన్సూరెన్స్ కూడా వర్తించదు. అంటే బీసీసీఐ వారిద్దరికి చికిత్స చేయదు. ఇప్పుడు వారు రాష్ట్ర క్రికెట్ సంఘంపై ఆధారపడవలసి ఉంటుంది.

అయ్యర్-ఇషాన్‌లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించడంతో.. ఆఇద్దరి బ్రాండ్ వాల్యూ కూడా ప్రభావితం అవుతుంది. దీంతో వీరికి భారీగా కోత పడనుంది.

అలాగే, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లు మళ్లీ టీమిండియాలోకి వస్తారా లేక ఐపీఎల్ లాంటి  లీగ్‌లకే పరిమితమవుతారా అనేది చూడాలి. రంజీలు ఆడితేనే ఛాన్సులుంటాయని అంటున్నారు.

ముఖ్యంగా ఇషాన్ మాత్రం రోజురోజుకూ బీసీసీఐ ఆగ్రహానికి గురవుతున్నాడు. రంజీల్లోనూ ఆడకుండా, కేవలం ఐపీఎల్‌కు మాత్రమే ప్రిపేర్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.