TV9 Telugu

11 సిక్స్‌లతో 173 పరుగులు..  చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్..

20 Febraury 2024

ప్రస్తుతం ఇషాన్ కిషన్ టీమ్ ఇండియాకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ కూడా ఆడడం లేదు. 

అయితే, మూడు సంవత్సరాల క్రితం ఈ యంగ్ ప్లేయర్ చేసిన పనిని ఎవరు మర్చిపోగలరు? ఆ ఇన్నింగ్స్‌తోనే సంచలనంగా మారాడు.

2021 ఫిబ్రవరి 20న విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ చేయడం ద్వారా ఇషాన్ కిషన్ ఎన్నో రికార్డులతో చరిత్ర సృష్టించాడు.

జార్ఖండ్‌ తరపున ఆడుతున్నప్పుడు, మధ్యప్రదేశ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 

50 ఓవర్ల మ్యాచ్‌లో, అతను 94 బంతుల్లో 11 సిక్సర్లతో 173 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 173 పరుగుల ఇన్నింగ్స్ విజయ్ హజారే ట్రోఫీలో ఒక బ్యాట్స్‌మెన్ చేసిన మూడవ అత్యధిక స్కోరుగా నిలిచింది.

ఈ అద్భుతమైన సెంచరీ ఆధారంగా, జార్ఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 422 పరుగులు చేసింది. ఇది విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక స్కోరుగా నిలిచింది.

ఇషాన్ చేసిన ఆ సాటిలేని సెంచరీ ఆధారంగా, జార్ఖండ్ 324 పరుగుల తేడాతో గెలిచింది. ఇది లిస్ట్ Aలో భారత గడ్డపై ఏ జట్టుకైనా అతిపెద్ద విజయం.

ఆ మ్యాచ్‌లో జార్ఖండ్ నిర్దేశించిన 423 పరుగుల పర్వతం లాంటి లక్ష్యాన్ని మధ్యప్రదేశ్ జట్టు 100 పరుగులు కూడా చేయలేకపోయింది. 18.4 ఓవర్లలో 98 పరుగులకే ఆలౌటైంది.