టీం ఇండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉంటున్నాడు. దీనికి కారణం ఎవరికీ తెలియదు.
ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికా పర్యటనను మధ్యలోనే వదిలేసి వచ్చేశాడు. ఆ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. రంజీల్లో ఆడతాడని అంతా భావించారు. కానీ, అలా కూడా జరగలేదు.
శుక్రవారం జార్ఖండ్, సర్వీసెస్ మధ్య మ్యాచ్ ఉంది. ఇషాన్ కిషన్ బహుశా ఈ మ్యాచ్‌లో ఆడాల్సి ఉంది. కానీ అతను ప్లేయింగ్ ఎలెవెన్‌లో లేడు.
ఇటీవల, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, ఇషాన్ కిషన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడతాడని తెలిపాడు. అయితే అతను రంజీ మ్యాచ్‌లు కూడా ఆడలేకపోయాడు.
ఇషాన్ కిషన్ ఆడకపోవడం వెనుక అనేక వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు మానసికంగా అలసిపోయాడని, మరికొందరు కోచ్ ఆగ్రహానికి గురయ్యాడని అంటున్నారు.
ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో ఇషాన్ కిషన్ ఎంపిక కాలేదు. ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో కూడా అతను ఎంపిక చేయలేదు.
ఇషాన్ కిషన్ ఇలాగే ఫీల్డ్‌కు దూరంగా ఉంటే, రాబోయే టీ20 ప్రపంచకప్‌లో ఆడడం అతనికి కష్టమేనని భావిస్తున్నారు.
కాగా, జనవరి 25 నుంచి ఇంగ్లండ్‌తో భారత్ 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే తొలి రెండు టెస్టుకు భారత జట్టును ఎంపిక చేశారు.