IPLలో ముగ్గురి దిగ్గజాల శకం ముగిసింది..
TV9 Telugu
21 March 2024
2008 లో ప్రారంభమైన ఐపీఎల్ లో అనేక మంది గొప్ప ఆటగాళ్ళు వివిధ జట్లకు నాయకత్వం వహించారు. తమ జట్లకు అద్భుత విజయాలు అందించారు. చాటుకుంటున్నారు.
ఈ లిస్టులో సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందుంటారు.
రోహిత్ శర్మ, ధోని నాయకత్వాల్లో ముంబై, చెన్నై జట్లు చెరో ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలను సొంతం చేసుకున్నాయి.
కాబట్టి ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోని, రోహిత్ ముందుంటారు. అయితే కోహ్లీని తక్కువ చూడలేం.
ఒక్క ట్రోఫీ కూడా గెలవనప్పటికీ, ఐపీఎల్‌లో RCBని అత్యంత ప్రజాదరణ పొందిన జట్టుగా మార్చడంలో కింగ్ కోహ్లీ పాత్ర ఎంతో కీలకం
కాగా గత 16 ఎడిషన్లలో ఈ ముగ్గురిలో కనీసం ఒకరు జట్టును నడిపించే కెప్టెన్సీ బాధ్యతలతో ఐపీఎల్ లో బరిలోకి దిగారు.
ఇప్పటికే కెప్టెన్లుగా విరాట్, రోహిత్ తప్పుకున్నారు. తాజాగా సీఎస్కే సారథిగా ధోని కూడా తప్పుకున్నాడు.
దీంతో ఈ ముగ్గురు కెప్టెన్సీ లేకుండా ఐపీఎల్ జరగడం ఇదే తొలిసారి. దీంతో ఫ్యాన్స్ చాలా నిరాశపడుతున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి..