కుల్దీప్ స్పిన్ మాయాజాలం.. క్రీజ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ డ్యాన్స్..

12 September 2023

టీమిండియా ఆల్ రౌండర్ కుల్దీప్ యాదవ్ తన స్పిన్ బౌలింగ్‌తో మాయాజాలం చేశాడు. వరుసగా 5 వికెట్లు పడగొట్టి.. పాక్‌పై భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

కుల్దీప్ యాదవ్ తన మ్యాజిక్ బౌలింగ్‌తో పాక్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. కుల్దీప్ దెబ్బకు పాక్ బ్యాటర్స్ విలవిల్లాడారు.

కుల్దీప్ స్పిన్ మంత్రకు పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఫుల్ కన్‌ఫ్యూజ్ అయ్యారు. బంతిని పసిగట్టలేక క్రీజ్‌లో డ్యాన్స్ చేసినంత పని చేశారు. తత్తరపాటుకు గురయ్యారు.

కుల్దీప్ బౌలింగ్ దెబ్బకు పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియన్ బాట పట్టారు.

పాకిస్తాన్ మిడిలార్డర్ మొత్తాన్ని కుప్పకూల్చాడు కుల్దీప్ యాదవ్. వరుసగా 5 వికెట్లు పడగొట్టి అందరితో శభాష్ అనిపించుకున్నాడు.

మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అయిన ఆఘా సల్మాన్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్‌ను పెవిలియన్ బాట పట్టించాడు కుల్దీప్.

పాక్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఫఖర్ జమాన్ తన స్థానాన్ని స్థిరంగా నిలబెట్టుకోవాలని ట్రై చేస్తున్న క్రమంలో కుల్దీప్ వచ్చి వికెట్ పడగొట్టేశాడు.

32వ ఓవర్ చివరి బంతికి ఫహీమ్ అష్రఫ్‌ను ఔట్ చేయడంతో కుల్దీప్ పాక్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. మొత్తంగా తన స్పిన్‌తో పాక్ బ్యాట్స్‌మెన్‌ను డ్యాన్ చేయించాడు.