టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.. 

6th January 2024

Pic credit - Instagram

ఈ ఏడాది T20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్‌ను జనవరి 5న ప్రకటించారు. పాకిస్థాన్‌, ఐర్లాండ్‌, కెనడాతో పాటు భారత్‌ గ్రూప్‌-ఎలో చోటు దక్కించుకుంది. 

USA, వెస్టిండీస్‌లు ఆతిథ్యం ఇవ్వనున్న ICE టోర్నమెంట్ జూన్ 1 నుంచి ప్రారంభమవుతుంది. భారత క్రికెట్ జట్టు జూన్ 5 నుంచి టోర్నమెంట్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. 

టీమిండియా మొదటి మ్యాచ్ న్యూయార్క్‌లో ఐరిష్ జట్టుతో జరుగుతుంది. జూన్ 9న న్యూయార్క్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ రెండో మ్యాచ్ ఆడనుంది. 

ICC టోర్నమెంట్లు, ఆసియా కప్ సమయంలో మాత్రమే భారత్, పాక్ రెండు జట్లూ ఒకదానికొకటి తలపడతాయి. కాబట్టి అందరూ ఈ మ్యాచ్ కోసం వేచి చూస్తున్నారు.

ఆ తర్వాత, భారత జట్టు జూన్ 12న న్యూయార్క్‌లో ఆతిథ్య అమెరికాతో తలపడుతుంది. జూన్ 15న ఫ్లోరిడాలో కెనడాతో తన చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది.

2007లో ఆడిన తొలి టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకోగలిగింది. చివరిసారిగా 2014లో శ్రీలంకపై ఫైనల్ ఆడింది. అందులో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. 

కాగా, గత ఎడిషన్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడి భారత జట్టు సెమీస్‌ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. దీంతో ఈసారి కప్ కొట్టాలని అభిమానులంతా కోరుకుంటున్నారు.

ఈసారి టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి ప్రారంభమవుతుందని, జూన్ 29న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. టోర్నీలో మొత్తం 55 మ్యాచ్‌లు జరుగుతాయి. 

ఇందులో 40 గ్రూప్ మ్యాచ్‌లు ఉంటాయి. ఆ తర్వాత సూపర్ 8 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఆపై సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు,  ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.