TV9 Telugu
29 July 2024
వన్డే సిరీస్ కోసం శ్రేయాస్ అయ్యర్ శ్రీలంక వెళ్లాల్సి ఉంది. కానీ, అంతకుముందే అతను ఒకరి పుట్టినరోజు వేడుకలో సందడి చేశాడు.
ఈ పుట్టినరోజు పార్టీలో శ్రేయాస్ అయ్యర్ చుట్టూ అమ్మాయిలు కనిపించారు. అయితే, అతని చుట్టూ ఉన్న కొంతమంది అమ్మాయిల్లో ఒకరు సోదరి శ్రేష్ట కూడా ఉంది.
శ్రేయాస్ నిజానికి తన ప్రత్యేక స్నేహితురాలు, ప్రముఖ కాస్మోటాలజిస్ట్ డాక్టర్ అసనా కంచవాలా పుట్టినరోజు పార్టీకి హాజరయ్యారు.
ఈ బర్త్ డే పార్టీలో శ్రేయాస్ అభిమానులకు కొదవలేదు. కొందరు పిల్లలు అతని వద్ద ఆటోగ్రాఫ్ తీసుకోవడం కనిపించింది.
ఈ పార్టీకి హాజరైన వారిలో చాహల్ భార్య ధనశ్రీ కూడా ఉంది. ధనశ్రీ తన పుట్టినరోజు సందర్భంగా ఆమెను ఆశ్చర్యపరిచిన విధానాన్ని డాక్టర్ అసనా తన ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నారు.
శ్రేయాస్ అయ్యర్ శ్రీలంక టూర్ ODI జట్టులో సభ్యుడు. అతి త్వరలో అతను కొలంబోకు వెళ్లనున్నాడు.
శ్రేయాస్ అయ్యర్ తన చివరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 2024లో భారత్ తరపున ఆడాడు. అప్పటి నుంచి టీమిండియాకు దూరంగా ఉన్నాడు.
గంభీర్ రాకతో శ్రేయాస్ అయ్యార్ లక్ మారిందనే చెప్పాలి. బ్యాడ్ పాంతో పోరాడుతోన్న అయ్యర్‌కు గంభీర్ రాగానే లక్ మారింది. నేరుగా వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.