ప్రపంచకప్‌లో డేంజరస్ షమీ.. గణాంకాలు చూస్తే షాకే..

31st OCT 2023

Pic credit - Instagram

భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ 2023 వన్డే ప్రపంచ కప్‌లో కేవలం రెండు మ్యాచ్‌లలో 9 వికెట్లు పడగొట్టాడు. షమీ చాలా డేంజర్‌గా కనిపిస్తున్నాడు.

రెండు మ్యాచ్‌లలో 9 వికెట్లు

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ 2023 వన్డే ప్రపంచకప్‌లో కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడి సంచలనం సృష్టించాడు. ప్రత్యర్ధులకు వణుకుపుట్టిస్తున్నాడు.

ప్రత్యర్ధులకు వణుకు

2015 నుంచి భారతదేశం తరపున వన్డే ప్రపంచ కప్ స్పెషలిస్ట్‌గా మారాడు. 2013లో అంతర్జాతీయ అరంగేట్రం చేసి, 2015లో తొలిసారి ప్రపంచకప్ ఆడాడు.

ప్రపంచ కప్ స్పెషలిస్ట్‌

తన తొలి వన్డే ప్రపంచకప్‌ నుంచి టీమ్‌ఇండియాకు షమీ ట్రంప్‌ కార్డుగా మరాడు. 2015 టోర్నీలో షమీ 7 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టాడు.

ట్రంప్‌ కార్డుగా

ఆ తరువాత, 2019 ప్రపంచ కప్‌లో, షమీ కేవలం 4 మ్యాచ్‌లలో హ్యాట్రిక్‌తో సహా 14 వికెట్లు పడగొట్టాడు. 

2019 ప్రపంచ కప్‌లో

2023 ప్రపంచకప్‌లో షమీ ఇప్పటివరకు కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇప్పటికే 9 వికెట్లు పడగొట్టాడు. 

2023 ప్రపంచకప్‌లో

2023 టోర్నీలో షమీ తన మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో 5 వికెట్లు, ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు.

రెండో మ్యాచ్‌లో 4 వికెట్లు

వన్డే ప్రపంచకప్‌లో, భారత పేసర్ ఇప్పటివరకు 13 మ్యాచ్‌ల్లో 14.07 అద్భుతమైన సగటుతో 40 వికెట్లు పడగొట్టాడు. 

13 మ్యాచ్‌ల్లో 40 వికెట్లు

ఈ కాలంలో అతను రెండుసార్లు 5 వికెట్లు, 4 సార్లు నాలుగు వికెట్లు తీశాడు. అతని అత్యుత్తమ స్కోరు 5/54. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన 11వ బౌలర్‌గా షమీ నిలిచాడు.

అత్యుత్తమ స్కోరు 5/54