జీరో నుంచి జస్ప్రీత్ బుమ్రా హీరో ఎలా అయ్యాడు?

TV9 Telugu

03 July 2024

జస్ప్రీత్ బుమ్రా చేసిన పని పురుషుల, మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి జరిగింది.

జీరో నుంచి హీరోగా

రెండోసారి టీ 20 ప్రపంచకప్ సాధించిన భారత జట్టు.. ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో ఆటగాళ్లు కూడా ఈ లిస్టులో చేరారు.

2వసారి ట్రోఫీ

T20 WC 2024లో బూమ్రా 0 నుంచి హీరో అయ్యాడు. తన పేరుతో ఓ భారీ రికార్డ్‌ను లికించుకున్నాడు. అదేంటో ఓసారి చూద్దాం..

చరిత్ర సృష్టించిన బుమ్రా

ఇక్కడ 0 నుంచి బుమ్రా హీరో అయ్యాడు అంటే అతను తన బ్యాట్‌తో ఎటువంటి పరుగులు చేయకుండా టీ20 ప్రపంచ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు.

0 నుంచి హీరోగా మారడం అంటే..

ఎకానమీ పరంగా తక్కువ పరుగులు ఇస్తూ బౌలింగ్ చేస్తూ 15 వికెట్లు పడగొట్టిన బుమ్రా 2024 T20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు.

15 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్

బుమ్రా 8 ఇన్నింగ్స్‌ల్లో 15 వికెట్లు తీశాడు. అయితే ఈ సమయంలో అతని బ్యాట్‌ నుంచి పరుగులు రాలేదు.

8 ఇన్నింగ్స్‌ల్లో 15 వికెట్లు..

టీ20 ప్రపంచ కప్ 2024లో బుమ్రా 8 మ్యాచ్‌లలో ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం పొందాడు. అందులో అతను 1 బంతి ఆడాడు. కానీ ఒక్క పరుగు కూడా చేయలేదు.

బ్యాటింగ్‌లో పరుగులు రాలేదు

ఈ విధంగా, T20 ప్రపంచ కప్ చరిత్రలో ఎటువంటి పరుగులు చేయకుండా అంటే 0 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను గెలుచుకున్న మొదటి ఆటగాడిగా బుమ్రా నిలిచాడు.

0 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా తొలి ఆటగాడు