TV9 Telugu
8 July 2024
రెండో మ్యాచ్‌లో తుఫాన్ సెంచరీతో అందరి మన్నలు పొందిన టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ.. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు.
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో అభిషేక్ శర్మ అద్భుత సెంచరీ చేశాడు. ఈ ఆటగాడు తన రెండో అంతర్జాతీయ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు.
అభిషేక్ శర్మ కేవలం 46 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. కాగా, అతను 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు.
అభిషేక్ శర్మ IPLలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. గత 5 సంవత్సరాలుగా కావ్య మారన్ జట్టులో భాగంగా ఉంది.
అభిషేక్ శర్మ 2019లో సన్‌రైజర్స్‌లోకి అడుగుపెట్టాడు. అంతకుముందు అతను ఢిల్లీ టీమ్‌లో భాగమయ్యాడు. ఆ తర్వాత కావ్య మారన్ తన జట్టుకు బదిలీ చేసింది.
అభిషేక్ శర్మ వరుసగా 3 సంవత్సరాలుగా రూ.55 లక్షలు అందుకున్నాడు. కానీ, హైదరాబాద్ 2022లో ఈ ఆటగాడిని రూ.6.5 కోట్లకు కొనుగోలు చేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు అభిషేక్ రూ.21 కోట్ల 64 లక్షలు సంపాదించాడు.
అయితే కోట్లు సంపాదిస్తున్న అభిషేక్ శర్మకు మాత్రం టీమిండియా నుంచి కేవలం రూ.6 లక్షలు మ్యాచ్ ఫీజు అందడం గమనార్హం.