17 Sep 2023
Pic credit - Instagram
ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఈరోజు అంటే సెప్టెంబర్ 17న భారత్-శ్రీలంక మధ్య జరగనుంది. ఇరుజట్ల బలాలు సమానంగానే కనిపిస్తున్నాయి.
ఈ మ్యాచ్ శ్రీలంకలోని కొలంబోలో జరగనుంది. ఇక్కడ ఇరుజట్లు ప్రపంచ కప్‌నకు ముందు ఈ కీలక టైటిల్‌ను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తాయనడంలో సందేహం లేదు.
విశేషమేమిటంటే.. దాదాపు 29 ఏళ్ల క్రితం ఇదే తేదీన అంటే సెప్టెంబర్ 17న భారత్-శ్రీలంక మధ్య అద్భుతమైన ఫైనల్ జరిగింది. ఆ మ్యాచ్‌లో గెలిచి భారత్ ట్రోఫీ దక్కించుకుంది.
ఆ ఫైనల్ మ్యాచ్‌లో ఏం జరిగిందో, 29 ఏళ్ల తర్వాత మళ్లీ అదే చరిత్ర పునరావృతం అవుతుందో లేదో చూడాలి. ఆనాడు అజహారుద్దీన్ చేసిన మ్యాజిక్, నేడు రోహిత్ చేస్తాడో లేదో చూడాలి.
17 సెప్టెంబరు 1994న, సింగర్ వరల్డ్ సిరీస్‌లో భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య చివరి మ్యాచ్ వర్షం కారణంగా ప్రభావితమైంది. నేడు కూడా వర్షం కురిసే ఛాన్స్ ఉంది.
ఈ 25 ఓవర్ల మ్యాచ్‌లో శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 98 పరుగులు మాత్రమే చేసింది. జవాబుగా భారత్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.
కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ 45 పరుగుల ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అదే మ్యాజిక్ నేడు ఆసియా కప్ 2023లో రిపీట్ అవుతుందా లేదా చూడాలి.
ఇప్పుడు మళ్లీ 17 సెప్టెంబర్ 2023న, ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ వర్సెస్ శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే కావడం గమనార్హం. హిస్టరీ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.