TV9 Telugu

టెస్ట్‌ల్లో కొడుకు.. వ్యాఖ్యతగా తండ్రి.. రాజ్‌కోట్‌లో ఒకేరోజు అరంగేట్రం

15 Febraury 2024

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న రాజ్‌కోట్‌ టెస్టు మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ఖాన్‌ అరంగేట్రం చేశాడు. 3 ఏళ్లుగా ఎదురుచూసిన ఆ క్షణం ఎట్టకేలకు అందివచ్చింది.

26 ఏళ్ల సర్ఫరాజ్ దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వర్షం కురిపించడంతో.. రాజ్‌కోట్‌లో అద్భుతమైన అవకాశం వచ్చింది. డెబ్యూ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

సర్ఫరాజ్ ఖాన్ 66 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 62 పరుగులు చేసి, రన్‌ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో జడేజాతో కలిపి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు.

అయితే, సర్ఫరాజ్ తండ్రి నౌషాద్ ఖాన్ తన కుమారుడికి క్రికెట్ నేర్పించేందుకు చాలా కాలం పాటు కష్టపడ్డాడు. ఈరోజు అతని కష్టానికి ఫలితం దక్కింది. సర్ఫరాజ్ అరంగేట్రం చేసిన తీరు చిరస్మరణీయమని ఆయనికి తెలుసు.

సర్ఫరాజ్ ఖాన్ టీమ్ ఇండియా క్యాప్ అందుకున్నప్పుడు, అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. అలాగే, నౌషాద్ ఖాన్ కూడా చాలా ఎమోషనల్ అయ్యి ఏడ్చాడు.

మ్యాచ్ ప్రారంభమైనప్పుడు, నౌషాద్ ఖాన్ కూడా కామెంటరీలో అరంగేట్రం చేశాడు. అతను హిందీ వ్యాఖ్యానం చేశాడు. అనేక పద్యాలను కూడా చదివాడు. అది వైరల్ అయ్యింది.

రాత్రికి సమయం కావాలి, కానీ, నా కోరిక మేరకు సూర్యుడు ఉదయించడం లేదని నౌషాద్ ఖాన్ చెప్పుకొచ్చాడు. నౌషాద్ ఖాన్ ఈ పద్యం ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. 

26 ఏళ్ల సర్ఫరాజ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 39 మ్యాచ్‌లలో 3912 పరుగులు సాధించాడు. ఈ కాలంలో సర్ఫరాజ్ 69.85 సగటుతో పరుగులు సాధించాడు.