26 January 2024
మరోసారి ఘోర వైఫల్యం.. ఇక రోహిత్, ద్రవిడ్ కాపాడలేరంతే..
TV9 Telugu
టీమిండియా సూపర్‌స్టార్‌గా పేరొందిన శుభ్‌మన్ గిల్ టెస్టు క్రికెట్‌లో మరోసారి విఫలమయ్యాడు. తన పేలవ ఫాంతో నిరాశపరిచాడు.
హైదరాబాద్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు మాత్రమే చేసి శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు. టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో వికెట్ కోల్పోయాడు.
శుభ్‌మన్ గిల్ టెస్ట్ కెరీర్ చూస్తే, అతను గత 38 ఇన్నింగ్స్‌లలో 30 సగటుతో మాత్రమే పరుగులు చేస్తున్నాడు.
గత 10 టెస్టు ఇన్నింగ్స్‌లలో శుభ్‌మన్ గిల్ 19.22 సగటుతో పరుగులు చేయగలిగాడు. ఇది చాలా ఘోరంగా ఉండడంతో మాజీలు విమర్శిస్తున్నారు.
శుభ్‌మాన్ గిల్ 3వ స్థానంలో ఐదు టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతని బ్యాట్‌తో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయకపోవడం గమనార్హం.
కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నిరంతరం శుభ్‌మన్ గిల్‌కు అవకాశాలు ఇస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో విఫలమై నిరాశ పరిచాడు.
దీంతో రెండో టెస్ట్ నుంచి తప్పించే అవకాశం ఉందని మాజీలు భావిస్తున్నారు. తప్పించాలని సూచిస్తున్నారు. చెత్త షాట్‌లతో నిరాశపరుస్తున్నాడు.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం రెండు టెస్టులకు జట్టులో లేడు. అయితే, కోహ్లీ తిరిగి వస్తే, గిల్‌ను తొలగించే అవకాశం ఉంది.
ఇక్కడ క్లిక్ చేయండి..