TV9 Telugu
30 September 2024
కాన్పూర్ టెస్టులో రోహిత్ శర్మ అద్భుత క్యాచ్ పట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో షాకింగ్ ఫీల్డింగ్‌తో లిటన్ దాస్‌కు పెవిలియన్ దారి చూపించాడు.
8 అడుగుల ఎత్తుకు ఎగిరి రోహిత్ శర్మ బంతిని క్యాచ్ చేశాడు. అతని ఈ క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
రోహిత్ బరువైన శరీరంపై తరచుగా ప్రజలు ప్రశ్నలు సంధిస్తుంటారు. కానీ, భారత కెప్టెన్‌కు అద్భుతమైన ఫిట్‌నెస్, అందుకే అతను ఇంత మంచి క్యాచ్‌లు తీసుకుంటారని నెటిజన్స్ అంటున్నారు.
రోహిత్ శర్మ ఫిట్‌నెస్ రహస్యం అతని డైట్. ఈ ఆటగాడు అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాన్ని అనుసరిస్తాడు.
రోహిత్ శర్మ రోజుకు మూడు సార్లు భోజనంలో నాన్ వెజ్ తింటాడు. ఈ ఆటగాడు డిన్నర్‌లో కాల్చిన చేపలను తింటుంటాడంట.
ఈ విధంగా చేపలను తినడం వల్ల, అందులోని అధిక ప్రోటీన్ కంటెంట్ శరీరానికి మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది.
రోహిత్ శర్మ అల్పాహారంగా గుడ్లు, ఓట్స్, పండ్లు తింటాడు. మధ్యాహ్న భోజనంలో చికెన్, బ్రౌన్ రైస్ తింటాడు.
రోహిత్ శర్మ శరీరం బరువుగా కనిపించవచ్చు. కానీ, చాలా మంది ఫిట్‌నెస్ నిపుణులు ఈ ఆటగాడికి విరాట్ కోహ్లీకి సమానమైన ఫిట్‌నెస్ ఉందని చెబుతుంటారు.