ధోనీ - గంగూలీల కంటే చెత్త కెప్టెన్‌గా రోహిత్.. ఎందుకో తెలుసా?

TV9 Telugu

2 November 2024

ప్రస్తుతం రోహిత్ శర్మకు గడ్డుకాలం ఎదురవుతోంది. అతని బ్యాటింగ్, కెప్టెన్సీ రెండూ పేలవంగా ఉన్నాయి.

రోహిత్ శర్మకు చెడ్డ రోజులు

టెస్టు క్రికెట్‌లో గత 10 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ ఫ్లాప్‌గా నిలిచాడు. ఈ సమయంలో అతను 13.56 సగటుతో 103 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

10 ఇన్నింగ్స్‌ల్లో విఫలం

మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన చివరి టెస్టు సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత 7 మ్యాచ్‌లు ఆడినా ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు.

7 నెలలుగా సెంచరీ లేదు.

ఈ కాలంలో కెప్టెన్సీలో రోహిత్ శర్మ కూడా ఫ్లాప్‌గా కనిపించాడు. అతని కెప్టెన్సీలో, టీమ్ ఇండియా న్యూజిలాండ్‌తో మొదటిసారి టెస్ట్ సిరీస్‌ను కోల్పోవడం, ముందుగానే నిష్క్రమించడం వంటి అనేక చెడ్డ రికార్డులను సృష్టించింది.

కెప్టెన్సీలో కూడా ఫ్లాప్

భారత కెప్టెన్ పేరిట మరో చెత్త రికార్డు చేరింది. నిజానికి టాస్ కూడా రోహిత్ శర్మకు సపోర్ట్ చేయడం లేదు.

మరో చెడ్డ రికార్డు

టెస్టుల్లో టాస్ గెలవని రెండో చెత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. 21 టెస్టు మ్యాచ్‌ల్లో కేవలం 8 టాస్‌లు మాత్రమే గెలవగలిగాడు. టాస్‌ గెలవడంలో రోహిత్ 38.10 మాత్రమే లక్ ఉంది.

ఇదే టాస్‌ రికార్డ్

ధోనీ, గంగూలీలను కూడా రోహిత్‌ వెనకేసుకున్నాడు. ఈ టెస్టులో ధోనీ 43.33 శాతం, సౌరవ్ గంగూలీ 42.86 శాతం టాస్‌లు గెలిచారు. 

ధోనీ-గంగూలీ వెనుకబడ్డారు.

అత్యంత చెత్త రికార్డు లాలా అమర్‌నాథ్ పేరిట ఉంది. టెస్టులో 26.67 శాతం మాత్రమే టాస్‌ గెలిచాడు.

అగ్రస్థానంలో ఎవరంటే?