రోహిత్ కెప్టెన్సీపై భారీ మచ్చ.. 11 నెలల్లోనే 8 ఏళ్ల వెనక్కి టీమిండియా..
29th January 2024
TV9 Telugu
హైదరాబాద్ టెస్టులో ఇంగ్లండ్ చేతిలో భారత క్రికెట్ జట్టు 28 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్‌లో జరగనుంది.
కాగా, హైదరాబాద్ టెస్టులో 4వ రోజు భారత్ విజయానికి 231 పరుగులు చేయాల్సి ఉండగా టీమ్ ఇండియా కేవలం 202 పరుగులకే కుప్పకూలింది.
ఈ ఓటమితో రోహిత్ కెప్టెన్సీపై పెద్ద మరక పడింది. అతని కెప్టెన్సీలో భారత క్రికెట్‌లో గతంలో ఎన్నడూ జరగని సంఘటన చోటుచేసుకుంది.
ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 190 పరుగుల ఆధిక్యం సాధించినా ఓటమి పాలైంది. టెస్టు చరిత్రలో తొలిసారిగా ఇలా ఓడిపోయింది.
ఇది మాత్రమే కాదు.. రోహిత్ కెప్టెన్సీలో కేవలం 11 నెలల్లో టీమిండియా పరిస్థితి గత 8 సంవత్సరాలలో ఎలా ఉందో అలాగే మారింది.
కోహ్లీ సారథ్యంలో 8 ఏళ్లుగా స్వదేశంలో 2 టెస్టుల్లో ఓడిన టీమిండియా.. రోహిత్ కెప్టెన్సీలో గత 11 నెలల్లో స్వదేశంలో 2 టెస్టుల్లో ఓడిపోయింది.
అంతే కాదు స్వదేశంలో వరుసగా 3 టెస్టుల్లో విజయం సాధించలేకపోయింది. గత ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాపై మూడో టెస్టులో ఓడిపోగా, నాలుగో టెస్టు డ్రా కావడంతో ఇప్పుడు ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది.
ఇక్కడ క్లిక్ చేయండి..