హైదరాబాద్లో చరిత్రాత్మకం కానున్న భారత్-ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్..

21st January 2024

Pic credit - Instagram

TV9 Telugu

జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్ల సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. 

ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ ఆటగాళ్లు చాలా కాలంగా చెమటోడ్చుతున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు మొదట UAEలో తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు.

ప్రస్తుతం భారత గడ్డపై సిద్ధమవుతున్నారు. మరోవైపు 5 టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ జరిగే హైదరాబాద్‌లో భారత జట్టు శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు.

జనవరి 25 నుంచి హైదరాబాద్‌లో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌ ఎందుకు చరిత్రాత్మకం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం.

జనవరి 26న భారత్‌ - ఇంగ్లండ్‌లు తొలిసారి టెస్టు ఆడనున్నాయి. ఈ టెస్టు 5 రోజుల పాటు అంటే జనవరి 29 వరకు జరగనుంది. ఈ 5 రోజుల్లో జనవరి 26వ తేదీ కూడా ఉంది. 

జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవం. ఇప్పుడు భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌ను చరిత్రాత్మకంగా మార్చబోతున్న విషయం ఈ తేదీకి సంబంధించినది.

వాస్తవానికి జనవరి 26న అంటే రిపబ్లిక్ డే సందర్భంగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్లు మైదానంలో టెస్ట్ మ్యాచ్ ఆడడం ఇదే తొలిసారి. 

అయితే ఇంతకు ముందు 1973లో జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్ ప్రారంభం కాగానే ఇలాంటి సందర్భం వచ్చింది. కానీ, జనవరి 26న గేమ్ ఆడలేదు.

కానీ, 2024 కథ వేరు. 50 ఏళ్ల క్రితం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టెస్టులో ఇది కనిపించలేదు. ఈసారి కొత్త చరిత్రను లిఖించనుంది.