ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్లు వీరే..

18 February 2024

TV9 Telugu

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ తుఫాన్ బ్యాటింగ్ చేశాడు. 

వరుసగా రెండో టెస్టులోనూ డబుల్ సెంచరీ సాధించాడు. యశస్వి, సర్ఫరాజ్ ఖాన్ మధ్య సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 

యశస్వి తన ఇన్నింగ్స్‌లో మొత్తం 12 సిక్సర్లు కొట్టాడు. దీంతో ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 

ఈ క్రమంలో వసీం అక్రమ్‌ ప్రపంచ రికార్డును భారత యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ సమం చేయడం గమనార్హం. అలాగే మరెన్నో రికార్డులు తన పేరున లిఖించాడు.

టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు 12: యశస్వి జైస్వాల్ vs ఇంగ్లాండ్, రాజ్‌కోట్- 2024 12: వసీం అక్రమ్ vs జింబాబ్వే, షేఖుపుర- 1996

ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్‌గా కూడా యశస్వి నిలిచాడు. ఆయన నవజ్యోత్ సింగ్ సిద్ధూను వెనక్కునెట్టాడు. 

టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్‌గా కూడా యశస్వి నిలిచాడు. ప్రస్తుత సిరీస్‌లో ఇప్పటి వరకు 22 సిక్సర్లు బాదాడు.

భారత్ తరపున టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు.. 22: యశస్వి జైస్వాల్ vs ఇంగ్లాండ్, 2024* 19: రోహిత్ శర్మ vs సౌతాఫ్రికా, 2019

భారత్ తరపున టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు.. 14: హర్భజన్ సింగ్ vs న్యూజిలాండ్, 2010 11: నవజ్యోత్ సిద్ధూ vs శ్రీలంక, 1994