రీఎంట్రీతో రికార్డుల చరిత్ర సృష్టించి రోహిత్ శర్మ

12th January 2024

Pic credit - Instagram

టీమిండియా సారథి రోహిత్ శర్మ 14 నెలల తర్వాత భారత్ తరఫున టీ20 ఇంటర్నేషనల్ ఆడేందుకు తిరిగి వచ్చాడు. ఆఫ్ఘాన్ తో తొలి టీ20 ఆడాడు.

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొహాలీలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

అయితే, ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన ఖాతా కూడా తెరవలేకపోయాడు. శుభ్‌మన్ గిల్ కారణంగా రనౌట్ అయ్యాడు. దీంతో నెట్టింట్లో విమర్శలు వస్తున్నాయి.

రోహిత్ శర్మ పిలుపును గిల్ పట్టించుకోలేదు. నాన్ స్ట్రైక్ నుంచి రన్ తీయలేదు. దీని పర్యవసానాలను రోహిత్ చవిచూడాల్సి వచ్చింది.

టీ20లో భారత్ తరపున అత్యధిక సార్లు జీరో పరుగులకే ఔట్ అయిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఏ భారత కెప్టెన్ కూడా ఇలా ఔట్ కాలేదు.

రోహిత్ ఖాతా తెరవకుండానే 11 సార్లు ఔట్ అయ్యాడు. అతని తర్వాత ఐదుసార్లు జీరో వద్ద అవుట్ అయిన బ్యాటర్ కేఎల్ రాహుల్.

ఆఫ్ఘనిస్థాన్‌పై రోహిత్ జీరో పరుగులకే ఔట్‌ కావడం ద్వారా చెత్త రికార్డు సృష్టించాడు. భారత కెప్టెన్‌గా రోహిత్ ఐదుసార్లు సున్నాకి వెనుదిరిగాడు.

ఈ ఫార్మాట్‌లో టీమిండియాకు సారథ్యం వహించిన ఇతర ఆటగాళ్లు కేవలం 4 సార్లు మాత్రమే ఖాతా తెరవలేకపోయారు. ఇందులో రోహిత్ అగ్రస్థానంలో నిలిచాడు.

2022లో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో రోహిత్ తన చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. ఈ సిరీస్ నుంచి పునరాగమనం చేస్తున్నాడు.

ఈ సిరీస్ భారత్‌కు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు ఇదే చివరి టీ20 సిరీస్.