ఐసీసీ టీ20 ప్రపంచ కప్ గత విజేతల పూర్తి జాబితా ఇదే..

Venkatachari

29 May 2024

2007లో పాకిస్థాన్‌ను 5 పరుగుల తేడాతో ఓడించిన భారత్ 1వ టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచింది.

2009లో శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన పాకిస్థాన్ తదుపరి ఎడిషన్‌ను గెలుచుకుంది.

2010లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

2012లో వెస్టిండీస్ 36 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి తొలి కిరీటాన్ని గెలుచుకుంది.

2014లో భారత్‌పై శ్రీలంక 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

కోల్‌కతాలో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి రెండో ట్రోఫీని గెలుచుకుంది.

దుబాయ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన ఆస్ట్రేలియా తమ మొదటి ట్రోఫీని 2021లో గెలుచుకుంది.

2022లో పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించిన ఇంగ్లాండ్ మెల్‌బోర్న్‌లో 2వ ట్రోఫీని జోడించింది.