నా సీక్రెట్ చెబితే.. ఎవ్వరూ నాకు జాబ్ ఇవ్వరు: ఎంఎస్ ధోని
13 Febraury 2024
ధోనీ ఎన్నో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ప్రతి విజయం వెనుక ఏదో ఒక రహస్యం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో ధోనీ నుంచి ఓ విషయానికి సంబంధించి సీక్రెట్‌ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీంతో ధోని మాట్లాడుతూ.. నేను చెబితే ఎవరూ ఉద్యోగం ఇవ్వరంటూ షాక్ ఇచ్చాడు.
ఓ కార్యక్రమంలో సంభాషణ సందర్భంగా ధోనీ రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం జరిగింది. అక్కడ అతని కెప్టెన్సీలో ఆటగాళ్లు సాధించిన విజయాల గురించి ప్రశ్నించారు.
ప్రతి ఆటగాడు CSKకి వచ్చి బాగా ఆడటం ప్రారంభించే విషయం ఏమిటని ధోనీని అడిగారు. వాట్సన్, రహానే లేదా రాయుడు? మీరు వారికి ఏమి చెప్పారు? అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు ధోనీ స్పందిస్తూ.. నా రహస్యం చెబితే ఎవరూ జాబ్ ఇవ్వరు అంటూ బాంబ్ పేల్చాడు. దీంతో అక్కడున్న వారంతా నవ్వులు కురిపించారు.
పేరుగాంచిన కంపెనీలు తన రెసిపీ సీక్రెట్ వెల్లడించనట్లే, నేను కూడా నా రహస్యాన్ని బయటపెట్టను అంటూ ధోనీ చాలా ఆసక్తికరంగా సమధానమిచ్చాడు.
ప్రస్తుతం ధోని పొడవాటి జుట్టుతో కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇది మాత్రమే కాదు, అతను IPL 2024 కోసం తన సన్నాహాలు కూడా ప్రారంభించాడు.
ఇప్పటికే ఐపీఎల్ 2024 కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. తమ టీం సభ్యులతో కలసి మైదానంలో సందడి చేస్తున్నాడు. ఐపీఎల్ మార్చిలో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.