ఒకే ఇన్నింగ్స్‌లో 26 సిక్స్‌లు.. హైదరాబాదీ ప్లేయర్ ప్రపంచ రికార్డ్

27 January 2024

TV9 Telugu

రంజీ ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ తన్మయ్ అగర్వాల్ 366 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

తన్మయ్ కేవలం 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాడు.

ఈ హైదరాబాదీ ప్లేయర్ తన్మయ్ ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్రపంచ రికార్డును కూడా తన పేరుతో సృష్టించాడు.

అరుణాచల్‌పై తన్మయ్ 26 సిక్సర్లు బాదాడు. దీనికి ముందు ఒక ఇన్నింగ్స్‌లో 23 సిక్సర్ల రికార్డు కోలిన్ మున్రో పేరిట ఉంది.

366 పరుగుల ఇన్నింగ్స్‌లో తన్మయ్ స్ట్రైక్ రేట్ 202. 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడిగా నిలిచాడు.

అరుణాచల్ ప్రదేశ్‌పై తన్మయ్ 26 సిక్సర్లు కొట్టడమే కాకుండా 34 ఫోర్లు కొట్టాడు. అంటే అతని బ్యాట్ నుంచి మొత్తం 60 బౌండరీలు వచ్చాయి.

తన్మయ్ అగర్వాల్ తుఫాను ట్రిపుల్ సెంచరీ ఆధారంగా, హైదరాబాద్ కేవలం 59.3 ఓవర్లలో 615 పరుగులు చేసింది.

తన్మయ్ అగర్వాల్ తుఫాను ట్రిపుల్ సెంచరీతో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. దీంతో జైస్వాల్ లాంటి ప్లేయర్ దొరికాడని అంటున్నారు.