హార్దిక్‌ను టార్గెట్ చేసిన నటాషా? వీధుల్లో పడబోతున్నారంటూ పోస్ట్..

26 May 2024

TV9 Telugu

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదం కారణంగా హెడ్‌లైన్స్‌లో నిలిచిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు తన పెళ్లికి సంబంధించి వార్తల్లో నిలిచాడు.

హెడ్‌లైన్స్‌లో హార్దిక్ పాండ్యా

ఐపీఎల్ ముగిసిన తర్వాత అకస్మాత్తుగా హార్దిక్, అతని భార్య నటాషా స్టాంకోవిచ్ మధ్య సంబంధంలో చీలిక వచ్చిందనే పుకార్లు మీడియాలో వ్యాపించింది.

సంబంధంలో చీలిక?

నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన పేరు ముందు రాసిన 'పాండ్యా'ని తొలగించడంతో ఇదంతా జరిగింది.

ఇన్‌స్టా నుంచి పాండ్యా ఔట్..

మరోవైపు, హార్దిక్ కూడా తన భార్య పుట్టినరోజున ఎటువంటి పోస్ట్ చేయలేదు. దీంతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రూమర్ వ్యాపించింది,

బర్త్‌డేకు నో విషెస్..

దీంతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారని, హార్దిక్ పాండ్యా ఆస్తిలో 70% నటాషా పొందబోతున్నారని వార్తలు కూడా ప్రచారం మొదలైంది. 

విడాకులు, 70% ఆస్తి..

వీటన్నింటి మధ్య, నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మరో ట్విస్ట్ ఇచ్చింది. ఇది చాలా చర్చనీయాంశమైంది. హార్దిక్ నుంచి ఆమె విడిపోవడానికి లింక్ చేసినట్లైంది. 

ఫొటో లేవనెత్తిన ప్రశ్నలు..

నటాషా ఒక ఫొటోను పోస్ట్ చేసి - 'ఎవరో వీధుల్లోకి పడబోతున్నారు' అంటూ రాసుకొచ్చింది. ఇది హార్దిక్‌ను టార్గెట్‌గా చేసుకుని పోస్ట్ చేసిందని అంటున్నారు.

వీధుల్లో పడబోతున్నారు..

ఈ పోస్ట్‌లో నటాషా డ్రైవింగ్‌కు సంబంధించిన సూచనల ఫొటోను ఉంచింది. ఆమె కారు నడపడం నేర్చుకుంది లేదా ఆమె లైసెన్స్ పొందిందని చూపిస్తుంది. అందుకే అలాంటి క్యాప్షన్ రాసింది.

అసలు నిజం ఏంటంటే?