TV9 Telugu
9 July 2024
టీమిండియా కొత్త కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2027 ప్రపంచకప్ వరకు ఈ పాత్రలో జీజీ కనిపించనున్నాడు.
ఈ క్రమంలో కోచింగ్ స్టాప్ గురించి వార్తలు వినిస్తున్నాయి. గంభీర్ తన టీంలో తనకు అనుకూలమైన వారిని ఎంపిక చేసేందుకు స్కెచ్ వేశాడంట.
అభిషేక్ నాయర్‌ను అసిస్టెంట్ కోచ్‌గా చేయాలని గౌతమ్ గంభీర్ బీసీసీఐని కోరినట్లు వార్తలు వచ్చాయి.
ఐపీఎల్‌లో కేకేఆర్‌కి అభిషేక్ నాయర్ అసిస్టెంట్ కోచ్‌గా పని చేశాడు. వీరిద్దరి కాంబినేషన్‌తో కేకేఆర్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది.
అభిషేక్ నాయర్ టీమ్ ఇండియా తరపున 3 వన్డేలు ఆడాడు. అతను ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. అతని ఖాతాలో ఒక్క వికెట్ కూడా లేదు.
అభిషేక్ నాయర్ అంతర్జాతీయ క్రికెట్‌లో 7 బంతులు ఆడి ఖాతా తెరవలేకపోయాడు. అదే సమయంలో, 18 బంతుల్లో అతని పేరు మీద ఒక్క వికెట్ కూడా లేదు.
అభిషేక్ నాయర్ ముంబై తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. అతను 103 మ్యాచ్‌లలో 5749 పరుగులు చేశాడు. దీనితో పాటు అతను 173 వికెట్లు కూడా తీసుకున్నాడు.
అభిషేక్ నాయర్‌కు రోహిత్ శర్మతో సన్నిహిత స్నేహం ఉంది. 2011లో రోహిత్‌ని ప్రపంచకప్ జట్టులోకి ఎంపిక చేయకపోగా.. అతడికి భవిష్యత్తు కోసం అభిషేక్ శిక్షణనిచ్చాడు.