మైదానాలను ఆరబెట్టడానికి వింత పద్ధతులు.. చూస్తే షాక్ అవుతారు..

10 Sep 2023

Pic credit - Instagram

క్రికెట్ మ్యాచ్‌లో చాలా సార్లు వర్షం కురుస్తుంది. దాని కారణంగా మైదానం తడిగా మారుతుంది. మ్యాచ్ పూర్తి చేయడానికి మైదానాన్ని పొడిగా చేయాల్సి ఉంటుంది.

చాలా సార్లు గ్రౌండ్ స్టాఫ్ పిచ్‌ను ఆరబెట్టడానికి ఎన్నో రకాల పరికరాలను వాడుతుంటారు. ఇలాంటి కొన్ని ఆశ్చర్యకరమైన పద్ధతుల గురించి తెలిస్తే షాక్ అవుతారు.

ఆసియా కప్-2023లో ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వర్షం కురిసింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలోని గ్రౌండ్ స్టాఫ్ మైదానాన్ని ఆరబెట్టేందుకు టేబుల్ ఫ్యాన్లను ఉపయోగించారు.

కాగా, ఈ మ్యాచ్ వర్షంతో రిజర్వ్ డేకు వాయిదా పడింది. అంటే సెప్టెంబర్ 11న జరగనుంది. అంటే మ్యాచ్ ఎక్కడ ఆగిపోయిందో, అక్కడి నుంచే మొదలుకానుంది.

మ్యాచ్ ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసి పెవిలియన్ చేరారు.

గౌహతిలోని బర్సపరా స్టేడియంలో 2020లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా మైదానం తడిసిపోయింది. అప్పుడు గ్రౌండ్‌స్టాఫ్ పిచ్‌ను ఆరబెట్టడానికి హెయిర్ డ్రయ్యర్‌ను ఉపయోగించారు. 

2018లో జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో, లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంను ఎండబెట్టడానికి PCB రెండు సైనిక హెలికాప్టర్లను ఉపయోగించింది. 

IPL-2023 ఫైనల్‌లో కూడా వర్షం కురవడంతో నరేంద్ర మోదీ స్టేడియం బాగా తడిసిపోయింది. గ్రౌండ్ స్టాఫ్ పిచ్‌ను ఎండబెట్టడానికి స్పాంజ్‌లను కూడా ఉపయోగించారు.