IPL 2024లో తక్కువ జీతం పొందిన టాప్-5 ఇండియన్ ప్లేయర్స్

1st February 2024

TV9 Telugu

ఐపీఎల్ 2024 కోసం వేలం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో కొద్దిమంది ప్లేయర్స్ మాత్రమే వేలంలో పాల్గొన్నారు. కాగా, కొందరికి లక్కీ ఛాన్స్ దక్కింది.

ఐపీఎల్ 2024 వేలం

అయితే, కొంతమంది ప్లేయర్లను ఫ్రాంచైజీలు అలాగే అంటిపెట్టుకున్నాయి. వారిలో తక్కువ జీతంతో అలాగే తమ వద్ద అట్టిపెట్టుకున్నాయి.

తక్కువ జీతం..

గత ఏడాది ఐపీఎల్‌లో పునరాగమనం చేసిన ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మను గుజరాత్ టైటాన్స్ రాబోయే సీజన్‌లో రూ. 50 లక్షలకు తన వద్ద ఉంచుకుంది.

మోహిత్ శర్మ

ఐపీఎల్ 2024 కోసం అజింక్యా రహానెను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 50 లక్షలకు అట్టిపెట్టుకుంది.

అజింక్య రహానే 

ఐపీఎల్ 2024 కోసం ముంబై ఇండియన్స్ రూ. 50 లక్షలకు పీయూష్ చావ్లాను అట్టిపెట్టుకుంది. గత సీజన్ లోనూ అద్బుతంగా ఆకట్టుకున్నాడు.

పీయూష్ చావ్లా 

ఐపీఎల్ 2024 కోసం నిర్వహించిన వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మనీష్ పాండేను రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది.

మనీష్ పాండే 

ఐపీఎల్ 2024 కోసం రింకూ సింగ్‌ను రూ. 55 లక్షలకు కేకేఆర్ అట్టిపెట్టుకుంది. తక్కువ ధర అయినా, సత్తా చాటేందుకు మరోసారి సిద్ధమయ్యాడు.

రింకూ సింగ్ 

ఐపీఎల్ 2024 వచ్చే నెల అంటే మార్చి నుంచి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు దశల్లో జరగొచ్చని అంటున్నారు.

మార్చి నుంచి మొదలు