7 April 2024
TV9 Telugu
ఈ సెంచరీ ద్వారా కోహ్లి తన పేరిట అవాంఛిత రికార్డును కూడా నమోదు చేసుకున్నాడు. అతను 67 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు.
ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన లిస్టులో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. మొత్తంలో ఐపీఎల్ చరిత్రలో 8 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు.
విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో 242 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో కోహ్లీ 8 సెంచరీలతో లిస్టులో అగ్రస్థానంలో నిలిచాడు.
క్రిస్ గేల్ 142 మ్యాచ్‌ల్లో 6 సెంచరీలు పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన లిస్టులో క్రిస్ గేల్ రెండో స్థానంలో నిలిచాడు.
జోస్ బట్లర్ 100 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన లిస్టులో జాస్ బట్లర్ మూడో స్థానంలో నిలిచాడు.
కేఎల్ రాహుల్ 121 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన లిస్టులో కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో నిలిచాడు.
షేన్ వాట్సన్ 145 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన లిస్టులో షేన్ వాట్సన్ ఐదో స్థానంలో నిలిచాడు.
డేవిడ్ వార్నర్ 180 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన లిస్టులో డేవిడ్ వార్నర్ ఆరవ స్థానంలో నిలిచాడు.