TV9 Telugu
4 November 2024
న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఏకపక్ష ఓటమి తర్వాత.. ఇప్పుడు రోహిత్-విరాట్ టెస్టు కెరీర్ ప్రమాదంలో పడింది.
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో కూడా రోహిత్-విరాట్ విఫలమైతే, ఇది వారి కెరీర్‌లో చివరి టెస్ట్ సిరీస్ కావచ్చు.
ఇప్పటికే కివీస్‌తో 3 టెస్ట్‌లు ఓడిపోవడంతో సీనియర్ ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో దేశానికి చెందిన ఆరుగరు గొప్ప ఆటగాళ్ల కెరీర్ ముగిసింది.
2008లో కుంబ్లే, గంగూలీల టెస్ట్ కెరీర్ బోర్డర్-గవాస్కర్ సిరీస్‌తో ముగిసింది. కుంబ్లే తన చివరి టెస్టును ఢిల్లీలో, గంగూలీ నాగ్‌పూర్‌లో ఆడారు.
2012లో అడిలైడ్‌లో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ద్రవిడ్-లక్ష్మణ్ టెస్ట్ కెరీర్ ముగిసింది.
సెహ్వాగ్ టెస్ట్ కెరీర్ కూడా బోర్డర్-గవాస్కర్ సిరీస్‌తో ముగిసింది. అతను తన చివరి టెస్టును మార్చి 2, 2013న ఆడాడు.
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌తో ధోనీ టెస్టు కెరీర్ కూడా ముగిసింది. అతను 26 డిసెంబర్ 2014న మెల్‌బోర్న్‌లో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.