24 March 2024
TV9 Telugu
క్రికెట్ ప్రేమికులకు అదిరిపోయే ఆఫర్..
18 April 2024
క్రికెట్.. ఈ ఆట తెలియని వారుండరు. సెలవుల్లోనైతే ఖాళీ స్థలం ఎక్కడుంటే అక్కడ మూడు కర్రలు, లేదా బండరాళ్లు పాతి, బ్యాట్, బాల్‌తో ఆడేస్తుంటారు.
ఇంతటి క్రేజ్ ఉన్న క్రికెట్‌లో మజా అందించేందుకు ఫ్లిప్‌కార్ట్ రెడీ అయింది. ఇంట్లోనే క్రికెట్ ఆడేలా ఏఆర్ క్రికెట్ బ్యాట్‌ను పరిచయం చేసింది.
కొత్త ఆవిష్కరణతో వినియోగదారుల ముందుకు వచ్చేసింది ఫ్లిప్‌కార్ట్. దేశంలోనే మొట్టమొదటి క్రికెట్ కన్సోల్ ‘మెటాషాట్’ని పరిచయం చేసింది.
క్రికెట్ ప్రేమికులకు ఏఆర్ క్రికెట్ బ్యాట్ అయిన దీనిని పరిచయ ధరలో భాగంగా రూ. 5,499కే అందిస్తున్నట్టు ప్రకటించింది.
ఇండియాలోనే రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్‌బ్యాట్ వర్చువల్ గేమ్‌లో నిజమైన అనుభూతిని అందిస్తుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
గేమర్స్‌కు, మరీ ముఖ్యంగా క్రికెట్ ఫ్యాన్స్‌కు అద్భుతమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని పేర్కొంది.
కుటుంబంతో కలిసి ఇంట్లో క్రికెట్‌ను ఆస్వాదించే వారికి ఈ బ్యాట్ అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుందని తెలిపింది.
ఈ బ్యాట్‌ను టీవీకి, మొబైల్‌కు పీసీకి కనెక్ట్ చేసుకుని ఎంచక్కా గేమ్‌లో భాగమై మనం కూడా సిక్సర్లు, ఫోర్లు కొట్టి ఎంజాయ్ చేయొచ్చు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి