రిటైర్మెంట్ నుంచి తిరిగొచ్చిన బెన్ స్టోక్స్.. తుఫాన్ సెంచరీతో రికార్డ్ బ్రేక్

13 Sep 2023

Pic credit - Instagram

వన్డే ప్రపంచకప్‌నకు ముందు ఆసియాకప్‌తో పాటు ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ సిరీస్‌లు కూడా జరుగుతున్నాయి. కాగా, ఇప్పటికే జరిగిన 2 వన్డేల్లో చెరో విజయంతో సమానంగా నిలిచాయి.

బెన్ స్టోక్స్ వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, వన్డే ప్రపంచ కప్‌నకు ముందు తన రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన ఈ సిరీస్ నుంచి బెన్ స్టోక్స్ తిరిగి జట్టులోకి వచ్చాడు. మూడవ మ్యాచ్‌లో అతను సెంచరీ చేయడం ద్వారా అద్భుతాలు చేశాడు.

వన్డే క్రికెట్‌లో బెన్ స్టోక్స్‌కి ఇది నాలుగో సెంచరీ. అతను కేవలం 76 బంతుల్లోనే ఈ సెంచరీని సాధించి రిటైర్మెంట్ తర్వాత చరిత్ర సృష్టించాడు.

ఇంగ్లండ్‌కు చెందిన బెన్ స్టోక్స్ జులై 2022లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ఈ ఏడాది మళ్లీ వన్డే క్రికెట్ ఆడటం గురించి సూచించాడు.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తర్వాత బెన్ స్టోక్స్ డేవిడ్ మలాన్‌తో కలిసి దాదాపు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

వన్డే క్రికెట్‌లో బెన్‌స్టోక్స్‌కు ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ మ్యాచ్‌లో స్టోక్స్ 124 బంతుల్లో 182 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, 9 సిక్సులు ఉన్నాయి.

మలాన్ సెంచరీకి 4 పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లండ్ టీం 48.1 ఓవర్లో 368 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ 5, బెన్ లిస్టెర్ 3 వికెట్లు పడగొట్టారు.