2 సార్లు మృత్యువుని జయించి.. అత్యంత సంపన్న క్రికెటర్‌‌గా మారాడు..

25th January 2024

Pic credit - Instagram

TV9 Telugu

ఇంగ్లండ్ స్టార్ల పేర్లను తీసుకుంటే అందులో అలెస్టర్ కుక్, జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, జో రూట్, బెన్ స్టోక్స్ పేర్లు వినిపిస్తాయి.

కానీ ఇంగ్లండ్‌లోని అత్యంత ధనిక క్రికెటర్ గురించి మాట్లాడితే వీరిలో ఎవరూ మొదటి స్థానంలో లేకపోవడం గమనార్హం. 

మరి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి కూడా ఇంగ్లండ్ జట్టులో అనుభవజ్ఞుడే కావడం గమనార్హం. ఆ ఆటగాడి పేరు ఆండ్రూ ఫ్లింటాఫ్.

21వ శతాబ్దంలో ఇంగ్లండ్ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరైన మాజీ ఆల్ రౌండర్ ఫ్లింటాఫ్.. ఇంగ్లాండ్‌లోని అత్యంత ధనిక క్రికెటర్‌గా పేరుగాంచాడు.

బ్రిటిష్ వార్తాపత్రిక ది సన్‌లోని ఒక నివేదిక ప్రకారం 46 ఏళ్ల మాజీ ఆల్ రౌండర్ నికర విలువ దాదాపు 15 మిలియన్ పౌండ్లు అంటే రూ. 158 కోట్లు.

మైదానంలో తన బ్యాటింగ్, బౌలింగ్‌తో ఫ్లింటాఫ్ ఎన్నో అద్భుతాలు చేశాడు. మైదానం వెలుపల అతను మృత్యువును రెండుసార్లు జయించాడు.

2007 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ ఓడిపోయిన తర్వాత, ఫ్లింటాఫ్ విపరీతంగా మద్యం సేవించి తన స్నేహితులతో కలిసి జర్నీచేస్తోన్న పడవ సముద్రంలో బోల్తా పడింది. వారంతా సేవ్ అయ్యారు. 

2022లో 'టాప్ గేర్' షో షూటింగ్‌లో ఫ్లింటాఫ్‌కు ఘోర ప్రమాదం జరిగింది. మరోసారి మరణాన్ని ఓడించడంలో విజయం సాధించాడు.