07 Sep 2023
Pic credit - Instagram
బుధవారం న్యూజిలాండ్‌తో జరగనున్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ వన్డే జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ని చేర్చారు. కివీస్‌తో సిరీస్‌లో బ్రూక్‌ను 'బ్యాటింగ్ కవర్'గా చేర్చారు.
ఐర్లాండ్ సిరీస్ కోసం 13 మంది సభ్యుల జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. 24 ఏళ్ల ప్లేయర్ మొదట న్యూజిలాండ్ వన్డేలకు, తాత్కాలిక ప్రపంచ కప్ జట్టులో అవకాశం దక్కలేదు.
అయితే అతను ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ, T20Iలలో 122 పరుగులతో సత్తా చాటాడు. మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడిన హ్యరీ బ్రూక్ తుఫాన్ ఇన్సింగ్స్‌లతో ఈ లక్కీ ఛాన్స్ పట్టేశాడు.
154 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో దంచికొట్టాడు. దీంతో తప్పు తెలుసుకున్న ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్ న్యూజిలాండ్ సిరీస్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. అయితే, వన్డే ప్రపంచకప్ జట్టులో మార్పులు కూడా చేయనున్నట్లు తెలుస్తోంది.
T20I సిరీస్‌లో జానీ బెయిర్‌స్టో భుజం సమస్యతో బాధపడుతున్నాడు. ఇది ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్‌ను రాబోయే మ్యాచ్‌ల కోసం అతనికి విశ్రాంతి ఇవ్వడానికి, ప్రపంచ కప్‌నకు సిద్ధంగా ఉంచేందుకు ప్లాన్ చేసింది.
ఈ నెలాఖరులో ఐర్లాండ్‌తో ఇంగ్లండ్ స్వదేశంలో మూడు వన్డేలు ఆడనుంది. ఇందులో జాక్ క్రాలే తన కెప్టెన్సీ అరంగేట్రం చేయనున్నాడు. ప్రపంచకప్‌నకు వెళ్లే ఆటగాళ్లు లేని ఇంగ్లండ్ 2వ జట్టు ఇది.
ఇంగ్లాండ్ స్క్వాడ్: జోస్ బట్లర్ (కెప్టెన్), మోయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్, హ్యారీ బ్రూక్ (బ్యాకప్)
ఐర్లాండ్ జట్టు: రెహాన్ అహ్మద్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జాక్ క్రాలే (సి), బెన్ డకెట్ (విసి), సామ్ హైన్, విల్ జాక్స్, క్రెయిగ్ ఓవర్‌టన్, మాథ్యూ పాట్స్, ఫిల్ సాల్ట్, జార్జ్ స్క్రిమ్‌షా, జామీ స్మిత్, ల్యూక్ వుడ్.