12-02-2024

10 మ్యాచ్‌ల్లో 1054 పరుగులు.. కేఎల్ గైర్హాజరీతో లక్కీ ఛాన్స్..

TV9 Telugu

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు రాజ్‌కోట్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభంకానుంది.

ఈ మ్యాచ్‌కు ముందు టీమ్‌ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో ఆడలేడు. అతను పూర్తిగా ఫిట్‌గా లేడు.

కేఎల్ రాహుల్ గాయం దేవదత్ పడిక్కల్‌కు గొప్ప వార్త అందించింది.ఈ ఎడమచేతి వాటం ఆటగాడు తొలిసారి టెస్టు జట్టులో అవకాశం దక్కించుకున్నాడు.

దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఆటగాడు గత 10 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు సాధించాడు.

ఈ 10 మ్యాచ్‌ల్లో పడిక్కల్ 1054 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ లయన్స్‌పై అద్భుతమైన సెంచరీ, హాఫ్ సెంచరీ కూడా చేశాడు.

పడిక్కల్ ఇప్పటివరకు 31 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను తన బ్యాట్‌తో 44.75 సగటుతో 2227 పరుగులు చేశాడు.

2021లో శ్రీలంక పర్యటనలో పడిక్కల్‌కు రెండు టీ20 మ్యాచ్‌లలో అవకాశం వచ్చింది. అందులో అతను 38 పరుగులు చేశాడు. 

ఇప్పుడు మరోసారి టీమ్ ఇండియాకు ఎంపికయ్యాడు. అది కూడా సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్ట్‌ల్లో అవకాశం వచ్చింది. ప్లేయింగ్ 11లో చోటు వస్తుందా లేదో చూడాలి.