6th OCT 2023
Pic credit - Instagram
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ (ENG vs NZ) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఏకపక్షంగా ఇంగ్లండ్‌ను ఓడించి ఎన్నో రికార్డులు సృష్టించింది.
కివీ జట్టు తరపున డెవాన్ కాన్వే, రచైన్ రవీంద్ర అద్భుతమైన సెంచరీలు చేసి తమ జట్టుకు సులువైన విజయాన్ని అందించారు. ఈ ఇద్దరు ఆటగాళ్లకు ప్రపంచకప్‌లో ఇది మొదటి మ్యాచ్. ఇద్దరూ సెంచరీలు సాధించారు.
డేవాన్ కాన్వే 32 సంవత్సరాల 89 రోజుల వయస్సులో ప్రపంచ కప్ అరంగేట్రంలో సెంచరీ సాధించాడు. అలా చేసిన రెండవ ఎక్కువ ఏజ్ కలిగిన ఆటగాడిగా నిలిచాడు.
ఈ జాబితాలో ఐర్లాండ్‌కు చెందిన జెరెమీ బ్రే పేరు మొదటి స్థానంలో ఉంది. అతను 33 సంవత్సరాల 105 రోజుల వయస్సులో ప్రపంచ కప్ 2007లో జింబాబ్వేతో జరిగిన ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు.
1975లో భారత్‌తో జరిగిన ప్రపంచకప్‌లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఇంగ్లండ్ ఆటగాడు డెన్నిస్ అమిస్ పేరు మూడో స్థానంలో ఉంది. అప్పటికి అతని వయసు 32 ఏళ్ల 61 రోజులు.
కాగా, ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ దూకుడు వైఖరిని ప్రదర్శించారు. కానీ, క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 282 పరుగులు మాత్రమే చేసింది.
దీంతో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. డేవాన్ కాన్వే 121 బంతుల్లో అజేయంగా 152 పరుగులు, రచిన్ 96 బంతుల్లో అజేయంగా 123 పరుగులు చేశారు.