అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వన్డే ప్రపంచకప్ ఫైనల్ హోరాహోరీగా జరుగుతోంది. టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ కోసం తలపడుతున్నాయి
20 ఏళ్ల క్రితం ఫైనల్‌లో ఆసీస్ చేతిలో భారత్ ఓటమి చవిచూసింది. అయితే ఈ సారి ఆ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా? లేదా అని యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది
45 రోజులపాటు జరిగిన ప్రపంచకప్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య తుది సమరం ఆరంభమైంది. రెండు జట్టు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఇండియా 10 మ్యాచుల్లో గెలుపు బావుటా ఎగురవేసింది.. ఇక ఆస్ట్రేలియా 10 మ్యాచుల్లో 8 గెలుపొందింది
ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ విశ్వవిజేతకు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారనే విషయం ప్రస్తుతం సర్వత్రా చర్చణీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఐసీసీ ముందుగానే విడుదల చేసింది
ఓడీఐ టోర్నీ విజేతకు 40 లక్షల డాలర్లు అంటే రూ.33.31 కోట్లు బహుమతిగా అందజేస్తారు. రన్నరప్‌కు 2 మిలియన్ డాలర్లు అంటే రూ.16.65 కోట్లు అందించనున్నారు
ఈ టోర్నమెంట్ మొత్తం ప్రైజ్ మనీ 10 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ.83.29 కోట్లు అన్నమాట
ఫైనల్స్‌కు చేరిన రెండు జట్లు కాకుండా లీగ్ దశలోనే ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుకు 40 వేల డాలర్ల చొప్పున అందిస్తారు
సెమీ ఫైనల్‌లో ఓడిన ఒక్కో జట్టుకు 8 లక్షల డాలర్లు, లీగ్ స్టేజీలోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన ఒక్కో జట్టుకు లక్ష డాలర్ల చొప్పున అందచేయనున్నారు
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ క్రికెట్ మ్యాచ్‌ను దాదాపు 1,32,000 మంది ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. ఈ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి