లైవ్ మ్యాచ్‌లో రూల్స్‌ పాటించని పాక్ బ్యాటర్.. కట్‌చేస్తే.. ఊహించని షాక్

TV9 Telugu

21 September 2024

ప్రస్తుతం వెస్టిండీస్‌లో కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) జరుగుతోంది. ప్రస్తుతం ఇది చివరి దశకు చేరుకుంది.

CPLలో, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (TKR) వర్సెస్ బార్బుడా ఫాల్కన్స్ (ABF) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఏబీఎఫ్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో క్రికెట్ నిబంధనలను ఉల్లంఘించారు. ఒక్కసారి థర్డ్ అంపైర్ ఔట్ చేసిన బ్యాట్స్‌మెన్, ఆ తర్వాత నేరుగా పెవిలియన్‌లోకి వెళ్లడం మీరు ఇప్పటి వరకు చూసి ఉండాలి.

కానీ, సీపీఎల్‌లో ఏబీఎఫ్‌ తరపున ఆడిన పాక్‌ బ్యాట్స్‌మెన్‌ ఇమాద్‌ వాసిమ్‌ ఆగ్రహంతో థర్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని లెక్క చేయలేదు.

ABF ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో టీకేఆర్ బౌలర్ సునీల్ నరైన్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఆ ఓవర్ మూడో బంతికి ఇమాద్ వాసిమ్‌పై LBW కోసం అప్పీల్ చేశాడు.

అయితే, మైదానంలోని అంపైర్ అతడిని నాటౌట్‌గా ప్రకటించాడు. ఆ తర్వాత టీకేఆర్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా డీఆర్ఎస్ తీసుకున్నాడు. దీంతో థర్డ్ అంపైర్ ఇమాద్‌ను అవుట్‌గా ప్రకటించాడు. అంపైర్‌తో కొంత వాగ్వాదం తర్వాత ఇమాద్ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.

కానీ, ఇంతలో ఇమాద్ కోపంగా చూశాడు. అదే ఏబీఎఫ్ కోచ్ కూడా అరుస్తూ కనిపించాడు. అనంతరం ఫీల్డ్ అంపైర్‌తో థర్డ్ అంపైర్ మాట్లాడి నిర్ణయం మార్చుకున్నారు.

తిరిగి వచ్చిన ఇమాద్ వాసిమ్ 27 బంతుల్లో 36 పరుగులు చేసి తన జట్టు ABF కోసం మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. సీపీఎల్‌లో ఈ బ్యాడ్‌ అంపైరింగ్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది.