టెస్ట్ ప్రపంచంలో అత్యధికంగా 5 వికెట్లు తీసిన బౌలర్లు.. లిస్టులో మనోడు
TV9 Telugu
28 September 2024
టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించేందుకు రవిచంద్రన్ అశ్విన్ కేవలం 4 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా గ్రేట్ స్పిన్నర్ షేన్ వార్న్ 18 ఏళ్ల రికార్డును రవిచంద్రన్ అశ్విన్ బద్దలు కొట్టనున్నాడు.
రవిచంద్రన్ అశ్విన్ భారత్ తరపున 101 టెస్టు మ్యాచ్‌లు ఆడుతూ మొత్తం 37 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. షేన్ వార్న్ ఆస్ట్రేలియా తరపున 145 టెస్టు మ్యాచ్‌లు ఆడుతూ మొత్తం 37 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు.
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న కాన్పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటివరకు 1 వికెట్ తీసుకున్నాడు.
1. ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) – 133 టెస్టు మ్యాచ్‌ల్లో 67 ఐదు వికెట్లు పడగొట్టాడు.
2. రవిచంద్రన్ అశ్విన్ (భారతదేశం) – 101 టెస్టు మ్యాచ్‌ల్లో 37 ఐదు వికెట్లు
3. షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) – 145 టెస్టు మ్యాచ్‌ల్లో 37 ఐదు వికెట్లు పడగొట్టాడు.
4. రిచర్డ్ హ్యాడ్లీ (న్యూజిలాండ్) - 86 టెస్టు మ్యాచ్‌ల్లో 36 ఐదు వికెట్లు
5. అనిల్ కుంబ్లే (భారతదేశం) – 132 టెస్ట్ మ్యాచ్‌ల్లో 35 ఐదు వికెట్లు