చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్..
యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది.
ఈ టెస్టులో ఆస్ట్రేలియా గెలిచినా బెన్ స్టోక్స్‌కు మాత్రం ఈ మ్యాచ్ గుర్తుండిపోతుంది.
ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా సెంచరీ చేయడం ద్వారా స్టోక్స్ తన పేరిట ఎన్నో రికార్డులు సృష్టించాడు.
టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా స్టోక్స్ నిలిచాడు.
9 ఫోర్లు, 9 సిక్సర్లతో స్టోక్స్ 155 పరుగులు చేశాడు.
నాల్గవ ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరిట ఉండేది.
టెస్ట్‌లో నాల్గవ ఇన్నింగ్స్‌లో 6వ లేదా అంతకంటే తక్కువ స్థానంలో అత్యుత్తమ స్కోర్ చేసిన ప్లేయర్లు..
బెన్ స్టోక్స్ - 155 పరుగులు
ఆడమ్ గిల్‌క్రిస్ట్ - 149 నాటౌట్
డేనియల్ వెట్టోరి - 140
అసద్ షఫీక్ - 137
ఇక్కడ క్లిక్ చేయండి..