ఇద్దరు కోచ్‌లతో సౌతాఫ్రికా టూర్‌కు టీమిండియా.. కారణం ఏంటంటే? 

29th November 2023

Pic credit - Instagram

డిసెంబర్ 10 నుంచి భారత్ దక్షిణాఫ్రికా టూర్ ప్రారంభం కానుంది. ఈ టూర్‌లో టీమిండియా కోచ్‌ ఎవరు? దీనిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

కోచ్‌ల పేరుతో రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు బీసీసీఐ వీసాలు మంజూరు చేసింది. అయితే వీరిద్దరూ దక్షిణాఫ్రికా వెళతారా? అనేది సందేహంగా మారింది.

ఒక టూర్, ఒక జట్టు కోసం ఇద్దరు ప్రధాన కోచ్‌లు ఉండటం జరగదు. ఇటువంటి పరిస్థితిలో, ద్రవిడ్ లేదా లక్ష్మణ్‌లలో ఒకరు మాత్రమే వెళతారు.

ఒకవేళ రాహుల్ ద్రవిడ్ బీసీసీఐ ఆఫర్‌ను అంగీకరించి తన కాంట్రాక్ట్‌ను పొడిగించేందుకు అంగీకరిస్తే.. ప్రధాన కోచ్‌గా దక్షిణాఫ్రికాకు వెళ్లడం ఖాయం. కానీ అలా చేయకపోతే లక్ష్మణ్ వెళ్తాడు.

అయితే ద్రవిడ్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక టూర్ ప్రారంభానికి ఎక్కువ సమయం లేకపోవడంతో బీసీసీఐ ఎలాంటి రిస్క్ తీసుకునే మూడ్‌లో లేదు.

రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌ల ప్రయాణ పత్రాలను నింపి వీసాలు సిద్ధం చేయడానికి ఇదే కారణం అని తెలుస్తోంది.

టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం 2023 ప్రపంచ కప్‌తో ముగిసింది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

డిసెంబర్ 10 నుంచి భారత్ దక్షిణాఫ్రికా టూర్ ప్రారంభం కానుంది. ఇందులో 3 టీ20లు, 3 వన్టేలు, రెండు టెస్టులకు కూడా టీమిండియా ఆడనుంది.