04 November 2023
ఐపీఎల్ వేలం సందడి షురూ.. లక్నో బౌలర్ ను దక్కించుకున్న ముంబై.
ఈ ఏడాది డిసెంబర్‌లో దుబాయ్ వేదికగా జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలం సందడి షురూ అయింది.
నవంబర్ 15 లోపు అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లలో రిటైన్, రిలీజ్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని బీసీసీఐ ఆదేశాలు
దీంతో లక్నో సూపర్ జెయింట్స్.. తన పేసర్, వెస్టిండీస్ బౌలర్ రొమారియా షెపర్డ్‌ను ముంబైకి ట్రేడ్ చేసింది.
ఈ విషయాన్నిముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో కూడా వెల్లడించింది.
గత సీజన్‌లో ఉన్న కాస్త బౌలింగ్ వనరులతో అద్భుతంగా రాణించిన ముంబై ప్లేఆఫ్స్ చేరింది.
గుజరాత్ చేతిలో ఓడిపోవడంతో ముంబై ఫైనల్ చేరడంలో విఫలమైంది.
డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఐపీఎల్ – 2024 వేలం నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి