T20 ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టు ఏది?

Venkatachari

5 June 2024

టీ20 ప్రపంచకప్ ప్రారంభం కాగా ఎప్పటిలాగే ఈసారి కూడా ఈ టోర్నీలో సిక్సర్ల వర్షం కురుస్తోంది.

సిక్సర్ల వర్షం 

టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్కువ సిక్సర్లు కొట్టిన జట్లు? 

టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టు ఆస్ట్రేలియా. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 239 సిక్సర్లు కొట్టింది. 

ఆస్ట్రేలియా నంబర్ 1

టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తర్వాత వెస్టిండీస్ 224 సిక్సర్లు కొట్టింది. కాగా పాకిస్థాన్ 220 సిక్సర్లతో మూడో స్థానంలో ఉంది.

వెస్టిండీస్ నంబర్ 2

టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ 216 సిక్సర్లు బాది నాలుగో స్థానంలో ఉంది. 

నాలుగో స్థానంలో ఇంగ్లండ్

ఇక టీమిండియా విషయానికి వస్తే.. 207 సిక్సర్లతో టీమిండియా ఐదో స్థానంలో ఉంది. 

5లో భారత్

శ్రీలంక 203 సిక్సర్లతో ఆరో స్థానంలో ఉంది. దీంతో టీమిండియా తర్వాతి స్థానంలో నిలిచింది.

భారత్ తర్వాతే లంక

ఈ టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య మరోసారి సిక్స్‌ల పోరు జరగనుంది. ఈ పోరులో టీమ్ ఇండియా కూడా ముందుకెళ్లాలని భావిస్తోంది. 

నంబర్ వన్ ఎవరో..