TV9 Telugu

11 March 2024

వామ్మో.. ఈయన డేంజర్ భయ్యా, ప్రతీ 6 బంతుల్లో ఓ సిక్స్ బాదుడే

IPL 2024 మార్చి 22 నుంచి చెన్నైలోని ఎం చిదంబరం స్టేడియంలో ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ చెన్నై, ఆర్సీబీ మధ్య జరగనుంది.

ఐపీఎల్ 2024లోనూ సిక్సర్ల వర్షం కురుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గత సీజన్‌లో ఈ టోర్నీలో 1124 సిక్సర్లు నమోదయ్యాయి.

ఐపీఎల్‌లో లాంగ్‌ సిక్స్‌లు బాదిన బ్యాట్స్‌మెన్‌లు చాలా మంది ఉన్నారు. కానీ, తక్కువ బంతుల్లో సిక్సర్లు కొట్టిన రికార్డు ఆండ్రీ రస్సెల్ పేరిట ఉంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ప్రతి 6.7 బంతుల్లో సిక్సర్లు బాదడం ఈ టోర్నీ చరిత్రలో అత్యుత్తమంగా నిలిచింది. ఈ రికార్డును ఎవ్వరూ చేరుకోలేకపోయారు.

రస్సెల్ తర్వాత, టిమ్ డేవిడ్, రషీద్ ఖాన్ ప్రతి 7.6 బంతుల్లో సిక్సర్లు కొట్టారు. అలాగే, లియామ్ లివింగ్‌స్టన్ ప్రతి 8.5 బంతుల్లో ఒక సిక్స్ బాదేవాడు.

ఇక యూనివర్సల్ బాస్ వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ ప్రతి 9.3 బంతుల్లో సిక్సర్లు, షిమ్రాన్ హెట్మెయర్ ప్రతి 9.9 బంతుల్లో సిక్సర్లు కొట్టారు.

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రతి 10వ బంతికి సిక్సర్ కొట్టాడు.  భారత క్రికెటర్లలో అగ్రస్థానంలో ఉన్నాడు.

దీంతో రస్సెల్ రికార్డును 2024లో ఎవరు బీట్ చేస్తారో చూడాల్సి ఉంది. ముఖ్యంగా ఇండియన్ ప్లేయర్ల్ ఈ లిస్టులో చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.