కేప్‌టౌన్‌ టెస్ట్‌లో విఫలమైన ఆరుగురు భారత ఆటగాళ్లు..

1st January 2023

Pic credit - Instagram

భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్‌లో రెండో, చివరి మ్యాచ్ జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ భారత జట్టుకు కీలకం.

తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. దీంతో రెండో టెస్ట్‌లో గెలవాలని బలంగా కోరుకుంటోంది. సిరీస్ ను సమం చేయాలని కోరుకుంటోంది.

ప్రస్తుత టూర్‌లో 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టులోని ఆరుగురు ఆటగాళ్లకు కేప్‌టౌన్‌లో ఇప్పటికే 'టెస్ట్' అవకాశం ఇవ్వగా.. వారంతా విఫలమ్యారు.

కేప్ టౌన్‌లో ఆరుగురు ఆటగాళ్లకు 'టెస్ట్' అంటే అక్కడ వారి మునుపటి ప్రదర్శన అని అర్థం. గతంలో ఇక్కడ ఆడి విఫలం అయ్యారు.

గతంలో కేప్ టౌన్‌లో టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆరుగురు ఆటగాళ్లలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, ఆర్. అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు.

కేప్‌టౌన్‌లో ఇప్పటివరకు జరిగిన ఏకైక టెస్టులో రోహిత్, రాహుల్ 21, 22 పరుగులు మాత్రమే చేశారు. దీంతో మరోసారి వీరిద్దరి ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.

కేప్ టౌన్‌లో ఆడిన 2 టెస్టుల్లో విరాట్ కోహ్లీ 35.25 సగటుతో 141 పరుగులు చేశాడు.  ఇవి కాకుండా అశ్విన్ 2 టెస్టులు ఆడి 2 వికెట్లు మాత్రమే తీశాడు.

కేప్‌టౌన్‌లో జస్ప్రీత్ బుమ్రా 4 ఇన్నింగ్స్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు.  కాగా శార్దూల్ 1 టెస్టులో కేవలం 2 వికెట్లు, 17 పరుగులు మాత్రమే చేశాడు.