IND vs BAN: చెన్నై టెస్ట్‌లో రికార్డుల మోత.. అవేంటంటే?

TV9 Telugu

19 September 2024

IND vs BAN చెన్నై టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు నమోదైన రికార్డులు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

రిషబ్ పంత్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 4000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఎంఎస్ ధోని తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో 4 వేలు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు.

రవిచంద్రన్ అశ్విన్ టెస్టు క్రికెట్‌లో తన కెరీర్‌లో రెండో వేగవంతమైన అర్ధ సెంచరీని సాధించాడు. కేవలం 58 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. 

టెస్టు క్రికెట్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌కి ఇది రెండో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ. అంతకుముందు 2012లో టెస్టుల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు సృష్టించాడు.

రవిచంద్రన్ అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీని సాధించాడు. అశ్విన్ 108 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో అతనికిది ఆరో సెంచరీ.

జడేజాతో కలిసి 7వ వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని లిఖించాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌, జడేజా ఏడో వికెట్‌కు 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

ఏడో లేదా అంతకంటే తక్కువ స్థాయిలో బంగ్లాదేశ్‌పై ఏ వికెట్‌కైనా ఇప్పటివరకు భారత్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. 

అంతకుముందు 2004లో జహీర్ ఖాన్, సచిన్ టెండూల్కర్ 10వ వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ప్రపంచంలో 500కి పైగా టెస్టు వికెట్లు తీసి 6 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా టీమిండియా ప్లేయర్ అశ్విన్ నిలిచాడు.