గుండెలేకుండా మనిషి బ్రతకడం అసాధ్యం..గుండె ఒక్క సెకన్‌ ఆగినా ప్రాణం పోయినట్లే

ఐతే అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి అసలు గుండే లేదు..అయినా బ్రతికే ఉన్నాడు

క్రెయిగ్‌ లూయిస్‌ (55) అనే వ్యక్తి అరుదైన అమిలోయిడోసిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నాడు

ఈ వ్యాధి వల్ల అతని గుండె తీసివేయ వల్సి వచ్చింది

టెక్సాస్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన ఇద్దరు డాక్టర్లు రక్తాన్ని పల్స్‌ లేకుండా ప్రసరించడానికి సహాయపడే పరికరాన్ని తయారు చేసి అతనికి అమర్చారు

గుండె చేసే అన్ని పనులు ఈ పరికరం చేస్తుంది. ఐతే ఈసీజీ పరీక్ష చేస్తే మాత్రం ఫ్లాట్‌లైన్‌ కనిపిస్తుంది. పల్స్‌ కూడా ఉండదు..

ఈ పరికరం సాయంతో అతను కేవలం నెల మాత్రమే జీవించాడు. దీంతో ప్రపంచంలోనే గుండె లేకుండా జీవించిన తొలి మనిషిగా గుర్తింపు పొందాడు