ప్రస్తుతం మధుమేహం వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది
డయాబెటిస్ ఉన్నవారు రోజువారీ ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తే మంచిది
లేకపోతే మరిన్ని సమస్యలు వచ్చి పడే ప్రమాదం ఉందంటున్నారు వైద్య నిపుణులు
డయాబెటిస్ ఉన్నవారు మధ్యాహ్న భోజనం సమయంలో తప్పకుండా ఆకు కూరలు ఉండేలా చూసుకోవాలి
మధుమేహం బారిన పడిన వారు రోజువారీ భోజనంలో ఎక్కువ పప్పులను చేర్చడం ఎంతో మంచిది
రోజు గుడ్డు తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ వారికి ఎంతగానో ప్రయోజనం ఉంటుంది
డయాబెటిస్ ఉన్నవారికి కూడా పెరుగుతో ఎంతో మంచిది. పెరుగులో కాల్షియం, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి
మధుమేహంతో బాధపడుతున్నవారికి చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి. చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి