పీజేఆర్‌ అసలు పేరు పబ్బతిరెడ్డి జనార్థన్‌ రెడ్డి

1948 జనవరి 12లో హైదరాబాద్‌లో జన్మించారు. బాల్యం, విద్యాభ్యాసం, జీవితామంతా హైదరాబాద్‌లోనే

ఉద్యోగం చేస్తూనే కార్మిక నేతగా ఎదిగారు. కార్మిక నేతగా పేదల పక్షాన నిలబడ్డారు

తొలిసారి 1978లో 30ఏళ్లకే ఖైరతాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు

1978, 1985, 1989, 1994, 2004లో గెలిచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు

కార్మిక, పౌర సరఫరా శాఖ మంత్రిగా సేవలందించారు

మాజీ సీఎం అంజయ్య శిష్యుడిగా కాంగ్రెస్‌లో ఉన్నత స్థితికి ఎదిగారు

ప్రజల కోసమే పార్టీ అనే నినాదాన్ని నమ్మిన వ్యక్తి పీజేఆర్‌

సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చినా ప్రజల సమస్యపై మడమతిప్పని నైజం పీజేఆర్‌ది

ఎన్నో ప్రజా సమస్యలపై పోరు చేశారు. ఇదే ప్రజల్లో ఆయనకు సుస్థిర స్థానాన్ని సంపాదించింది

 జూబ్లీహిల్స్‌లో పెద్దమ్మ దేవాలయాన్ని నిర్మించారు

హైదరాబాద్‌లో ఎంతో మంది పేదలకు ఇళ్లు నిర్మించారు

 2007 డిసెంబర్‌ 28న గుండెపోటుతో పీజేఆర్‌ తుది శ్వాస విడిచారు

 పీజేఆర్‌ కుమార్తె ప్రజల కోసం 2011లో పీజేఆర్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించారు