‘డీజే టిల్లు’ బాక్సఫీస్‌ వద్ద మంచి విజయం అందుకుంది

ఈ మువీకి సీక్వెల్‌గా 'టిల్లు స్వ్కేర్‌’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే

ఐతే ఇన్నాళ్లూ హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలో తెగ తికమకపడ్డారు

హీరో సిద్ధు జొన్నలగడ్డ సరసన అనుపమ పరమేశ్వరన్‌ను కథానియికగా నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది

కొన్ని కారణాల వల్ల అనుపమ ఆ ప్రాజెక్టు నుంచి వైదొలిగిందని వదంతలు వచ్చాయి

ఆమె స్థానంలో మీనాక్షి చౌదరి, ఆమె నో చెప్పడంతో.. ఆ స్థానంలో శ్రీలీల ఎంట్రీ ఇచ్చిందని కూడా పుకార్లు షికార్లు చేశాయి

తాజాగా అనుపమ స్పందిస్తూ సిద్దు జుట్టుకు జెల్‌ క్రీమ్‌ రాస్తూ ‘This is my alternate career’ అంటూ వీడియో షేర్‌ చేసింది